ఈసారి కేంద్రంలో ప్రభుత్వం మారబోతోంది ఎవరూ ఆపలేరు: కేసీఆర్‌

సిఎం కేసీఆర్‌ బెంగళూరులో మాజీ ప్రధాని దేవగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామితో ఈరోజు సుదీర్గ సమావేశం తరువాత మీడియాతో మాట్లాడారు. తమ సమావేశంలో తెలంగాణ, కర్ణాటక, దేశ రాజకీయాలపై సుదీర్గంగా చర్చించామని చెప్పారు. 

దేశంలో ఉన్న వనరులు, సమస్యల గురించి గతంలో చెప్పిన విషయాలనే మరోసారి చెప్పిన తరువాత ఈసారి కేంద్రంలో ప్రభుత్వం మార్పు అనివార్యమని దానిని ఎవరూ ఆపలేరని అన్నారు. అందరూ చిత్తశుద్ధితో కలిసి పనిచేస్తే భారత్‌ తప్పకుండా అమెరికా కంటే గొప్ప దేశంగా నిలుస్తుందని, అందుకు అవసరమైన అన్ని రకాల వనరులూ మన దేశంలో సంవృద్ధిగా ఉన్నాయని చెప్పారు. కేంద్రంలో ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది?ఎవరు ప్రధాని అవుతారు? అనే అంశాల గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదని సిఎం కేసీఆర్‌ అన్నారు. మీడియా సంచలన వార్తల కోసం చూడకుండా దేశం కోసం నిజాయితీగా పనిచేయాలని చెపుతూనే మరో రెండు మూడు నెలల్లో ఓ సంచలన వార్త వినిపిస్తానని సిఎం కేసీఆర్‌ చెప్పడం విశేషం.