హైదరాబాద్ కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో సోమవారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ఆకస్మిక తనికీలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మూర్తి అనే వైద్యుడిని సస్పెండ్ చేశారు. మంత్రి హరీష్‌రావు తనికీలలో భాగంగా రోగులతో మాట్లాడుతున్నప్పుడు, దుర్గాప్రసాద్ అనే ఓ వ్యక్తి వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కోసం డాక్టర్ మూర్తి అనే వైద్యుడు రూ.500 లంచం అడుగుతున్నాడని ఫిర్యాదు చేశాడు.
మంత్రి హరీష్‌రావు అక్కడే పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డును, సిబ్బందిని పిలిచి విచారణ జరిపారు. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కోసం ఆ డాక్టర్ లంచం తీసుకొంటారని వారు చెప్పడంతో వెంటనే డాక్టర్ మూర్తిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించి, ఈరోజు సాయంత్రంలోగా సస్పెన్షన్ ఆర్డర్స్ పంపిస్తానని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రులలో వైద్య సౌకర్యాలు, మౌలిక వసతులు మెరుగుపరిచి, కేటీఆర్ కిట్స్ అందిస్తూ ప్రభుత్వాసుపత్రులకు ప్రజలను రప్పించి మరింత మెరుగైన సేవలు అందించాలని గట్టిగా ప్రయత్నిస్తోందని, ఆస్పత్రులకు వచ్చే రోగులను పీడిస్తే సహించేది లేదని మంత్రి హరీష్‌రావు ఆస్పత్రి సిబ్బందిని గట్టిగా హెచ్చరించారు.
కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో మంత్రి హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీలు.. డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్న డాక్టర్ మూర్తిని సస్పెండ్ చేసిన మంత్రి. pic.twitter.com/dI0Lg1PaZ9
— Namasthe Telangana (@ntdailyonline) May 23, 2022