సిద్ధూ ఖైదీ నంబర్: 241383, పాటియాలా జైల్!

మాజీ క్రికెటర్, మాజీ పంజాబ్‌ పిసిసి అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్‌ సిద్ధూ మూడు దశాబ్ధాల క్రితం ఆవేశంలో ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో సుప్రీంకోర్టు దోషిగా నిర్ధారించి ఏడాది కటిన కారాగార శిక్ష విధించింది. కనుక సిద్ధూ నిన్న పటియాలా కోర్టులో లొంగిపోయాడు. పోలీసులు అతనిని పటియాలా జైలుకి తరలించారు. 

జైలు అధికారులు అతనికి ఖైదీ నంబర్ 241383 కేటాయించి, 10వ నంబర్ సెల్‌లో ఉంచారు. దానిలో సిద్ధు కాకుండా మరో 8 మంది ఖైదీలు ఉన్నారు. 

మొదటిరోజు కనుక సిద్ధూ జైల్లో చాలా ఇబ్బందిపడ్డారని, మిగిలిన ఖైదీలతో పాటు సిమెంట్ పలకపై పడుకొన్నారని జైలు సిబ్బంది మీడియాకు తెలిపారు. ఆయనకు నాలుగు జతల జైలు యూనిఫామ్స్, రెండు తలపాగాలు, ఒక జత బూట్లు ఇఛ్ఛామని చెప్పారు. నిబందనల ప్రకారం ఒక తెబిల్, ఒక కుర్చీ, ఒక కప్ బోర్డ్, పెన్ను, కొన్ని పుస్తకాలు కూడా ఇచ్చామని చెప్పారు. 

శుక్రవారం రాత్రి మిగిలిన ఖైదీలతో పాటు సిద్ధూకి కూడా రొట్టెలు, పప్పు, సలాడ్, పళ్ళు ఇవ్వగా సిద్ధూ వాటిలో పళ్ళు  సలాడ్ మాత్రమే తిన్నారని చెప్పారు. ఆయనకు గోధుమలతో తయారు చేసిన ఆహార పదార్ధాల అలర్జీ ఉందని, కనుక తనకు వేరే ఆహారం ఇవ్వాలని సిద్ధూ కోరారని జైలు సిబ్బంది తెలిపారు.