నేడు నల్గొండలో పవన్ కళ్యాణ్‌ పర్యటన

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల మరణించిన తన ఇద్దరు అభిమానుల కుటుంబాలను పరామర్శించి వారికి చెరో రూ.5 లక్షల చొప్పున ఆర్ధికసాయం అందించేందుకు వెళ్తున్నారు. 

ఈరోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి బయలుదేరి 10.30 గంటలకు మెట్టుగూడ అంబేడ్కర్ చౌరస్తాలో ఆగి అక్కడ తన అభిమానులతో మాట్లాడుతారు. అక్కడి నుంచి 11 గంటలకు ఎల్బీ నగర్‌లోని అలకాపూరి కాలనీలో ఆగి తన అభిమానులతో మాట్లాడుతారు.  మధ్యాహ్నం 12.30 గంటలకు చౌటుప్పల్ చేరుకొని ఇటీవల మరణించిన తన అభిమాని, జనసేన కార్యకర్త కొంగరి సైదులు కుటుంబాన్ని పరామర్శించి వారికి రూ.5 లక్షల చెక్కు అందజేస్తారు. అక్కడ కొంతసేపు ఆగి మీడియాతో మాట్లాడుతారు. 

మధ్యాహ్నం 2 గంటలకు కోదాడ చేరుకొని అక్కడ తన అభిమాని కడియం శ్రీనివాస రావు కుటుంబాన్ని పరామర్శించి వారికి రూ.5 లక్షల చెక్కు అందజేసి మళ్ళీ హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం అవుతారు.