
రెండు తెలుగు రాష్ట్రాలతో సహా మొత్తం 15 రాష్ట్రాలలో ఖాళీ కాబోతున 57 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమీషన్ గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీలో నలుగురు సభ్యుల పదవీ కాలం జూన్ 21తో, తెలంగాణలో కెప్టెన్ లక్ష్మీకాంత రావు, డి.శ్రీనివాస్ల పదవీ కాలం జూన్ 29తో ముగుస్తుంది.
ఇక యూపీలో అత్యధికంగా 11, తమిళనాడు, మహారాష్ట్రలలో చెరో 6, బిహార్లో 5, రాజస్థాన్, కర్నాటక, ఏపీ రాష్ట్రాలలో చెరో 4, ఒడిశాలో 3, పంజాబ్, హర్యానా, ఛత్తీస్ఘడ్, ఝార్ఖండ్, తెలంగాణ రాష్ట్రాలలో చెరో 2 సీట్లు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక్క రాజ్యసభ సీట్లకి జూ 10వ తేదీన ఎన్నికలు జరుగబోతున్నాయి.
ఎన్నికల షెడ్యూల్:
నోటిఫికేషన్ జారీ: మే 24; నామినేషన్ల స్వీకరణకు గడువు: మే 31; నామినేషన్ల పరిశీలన: జూన్ 1; నామినేషన్ల ఉపసంహరణకు గడువు: జూన్ 3; పోలింగ్: జూన్ 10వ తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు.
ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన: జూన్ 10వ తేదీ సాయంత్రం 5 నుంచి ఫలితాలు ప్రకటించే వరకు.