చీఫ్ ఎన్నికల కమీషనర్‌గా రాజీవ్ కుమార్‌

కేంద్ర ఎన్నికల కమీషన్‌కు చీఫ్ కమీషనర్‌గా రాజీవ్ కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు చీఫ్ కమీషనర్‌గా చేస్తున్న సుశీల్ చంద్ర పదవీ కాలం ముగియనుండటంతో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమీషన్‌లో ముగ్గురు కమీషనర్‌లలో ఒకరుగా చేస్తున్న రాజీవ్ కుమార్‌ను ఆయన స్థానంలో నియమింపబడ్డారు. రాజీవ్ కుమార్‌ ఈ నెల 15వ తేదీన చీఫ్ కమీషనర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు.  

రాజీవ్ కుమార్‌ 1984 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. గత 37 ఏళ్ళుగా కేంద్ర, రాష్ట్ర స్థాయిలో వివిద హోదాలలో పనిచేసిన అపార అనుభవజ్ఞుడు. ఇదివరకు ఆయన ఆర్‌బీఐ, ఎస్‌బీఐ, నాబార్డు డైరెక్టరుగా పనిచేశారు. తరువాత కేంద్ర ఎన్నికల కమీషన్‌లో కమీషనర్‌గా చేస్తున్నారు.