అమెరికాలో నల్లగొండ విద్యార్ధి మృతి

అమెరికాలో నల్లగొండ జిల్లాకు చెందిన క్రాంతి కిరణ్ రెడ్డి సారెడ్డి (25) ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. జిల్లాలోని మిర్యాలగూడ మడలంలోని అన్నారంకు చెందిన సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అరుణ దంపతుల చిన్న కుమారుడైన క్రాంతి కిరణ్ రెడ్డి అమెరికాలో ఎంఎస్ చదివేందుకు వారెన్స్‌బగ్‌లోని మిస్సోరి సెంట్రల్‌ యూనివర్సిటీలో చేరాడు. ఏ ఏడాది ఆగస్ట్ నెలలో అతని డిగ్రీ పూర్తవుతుంది. 

ఈనెల 7వ తేదీ స్థానిక కాలమాన ప్రకారం సాయంత్రం 7.20 గంటలకు అతను తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ కారులో ప్రయాణిస్తుండగా ఎదురుగా దూసుకువచ్చిన ఓ భారీ కంటెయినర్ వారి కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో క్రాంతి కిరణ్ రెడ్డి ఘటనా స్థలంలోనే చనిపోగా మిగిలిన ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వారు ముగ్గురినీ హాస్పిటల్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.