తెలంగాణలో మళ్ళీ మోగిన ఎన్నికల నగారా

హుజూరాబాద్‌ ఉపఎన్నికలకు ముందు నుంచే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కగా, దానిలో ఈటల రాజేందర్‌ చేతిలో టిఆర్ఎస్‌ అభ్యర్ధి ఓడిపోవడంతో ఇంకా వేడెక్కింది. అప్పటి నుంచి రాష్ట్రంలో టిఆర్ఎస్‌-బిజెపిల మద్య ఆధిపత్యపోరు ఇంకా ముదిరిపోయింది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో మరోసారి ఉపఎన్నికకు నగారా మోగింది.

 ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్రకాష్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఈసీ నేడు ఉపఎన్నిక షెడ్యూల్  ప్రకటించింది.     

ఈ నెల 12న నోటిఫికేషన్‌ విడుదల చేసి అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల సమర్పించడానికి మే 19వరకు గడువు ఉంటుంది. మే 30వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించి ఆదేరోజున ఓట్లు లెక్కించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. వీరిని ఎమ్మెల్యేలు ఎన్నుకొంటారు కనుక ఈ ఎన్నికలో టిఆర్ఎస్‌ అభ్యర్ధి పేరు ఖరారు చేయడంతోనే రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైనట్లే. కనుక ఈ ఎన్నిక లాంఛనప్రాయమే అని చెప్పవచ్చు.