ధాన్యం కొనుగోలుకు మద్దతు ఇవ్వని రాహుల్‌కి తెలంగాణలో ఏం పని?

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ ఈనెల 6,7 తేదీలలో తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. తొలిరోజున వరంగల్‌లో కాంగ్రెస్‌ అధ్వర్యంలో జరిగే రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. మర్నాడు అమరవీరుల కుటుంబాలతో, ఓయూ విద్యార్దులతో భేటీ అవుతారు. 

రాహుల్ పర్యటనపై టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందిస్తూ, “ధాన్యం కొనుగోలు అంశంపై పార్లమెంటులో మా ఎంపీలు కేంద్రప్రభుత్వంతో పోరాడుతున్నప్పుడు వారికి మద్దతు ఇవ్వవలసిందిగా రాహుల్ గాంధీని కోరాము కానీ ఆయన పట్టించుకోలేదు. 

అప్పుడు రైతుల సమస్యలను పట్టించుకకోని ఆయన ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని రాష్ట్రానికి వస్తున్నారు?వచ్చి వరంగల్‌ సభలో రైతుల సమస్యల గురించి మాట్లాడితే సిగ్గుచేటు. ఆయన రాష్ట్రానికి, రైతులకు మద్దతు ఇవ్వకుండా రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనం పొందాలని ఆశిస్తున్నారు. రాజకీయ యాత్రకు వస్తూ మళ్ళీ ఓయూలో విద్యార్దులతో భేటీ ఎందుకు?ఓయూలో కూడా రాజకీయాలు చేయడానికేనా?” అని ప్రశ్నించారు.