
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈనెల 6, 7తేదీలలో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మొదటి రోజున వరంగల్‌లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో జరిగే రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారు. మే 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్ధి సంఘాల నేతలతో సమావేశమవ్వాలనుకొన్నారు. కానీ ఓయూ అధికారులు అనుమతి నిరాకరించారు.
దీంతో ఎన్ఎస్యుఐ విద్యార్ధి సంఘానికి చెందిన విద్యార్దులు ఆదివారం ఉదయం నిరసనలు తెలుపుతూ, వీసి రవీందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నలలో పనిచేస్తున్నారని ఆరోపిస్తూ ఆయనకి గులాబీ చీర, గాజులు ఇచ్చేందుకు ఆయన కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు వారిని అడ్డుకొని వారి అధ్యక్షుడు బల్మూరి వెంక ట్‌తో సహా మొత్తం 17 మంది విద్యార్దులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వారిని పరామర్శించడానికి వెళ్ళగా, పోలీసులు ఆయనను కూడా అరెస్ట్ చేసి అంబర్ పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈవిషయం తెలుసుకొన్న ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, గీతారెడ్డి తడితర కాంగ్రెస్ నేతలు వచ్చి ఆయనను పరామర్శించారు.
అరెస్ట్ చేసిన విద్యార్దులపై కేసులు ఎట్టేసి, తక్షణం బేషరతుగా వారినందరినీ విడుదల చేయాలని కేసిఎం జగన్మోహన్ రెడ్డి నేతలు డిమాండ్ చేశారు.
“తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి చెందిన మా నాయకుడు రాహుల్ గాంధీ యూనివర్సిటీకి వస్తుంటే వద్దనడానికి వీసీ ఎవరు?ఎవరు అనుమతించక, అనుమతించకపోయినా మే 7న రాహుల్ గాంధీ యూనివర్సిటీ విద్యార్దులతో సమావేశం నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.
యూనివర్సిటీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ విద్యార్ధి సంఘం తరపున నిన్న హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. దానిపై హైకోర్టు నేడు విచారణ జరుపనుంది.