కేటీఆర్‌ స్నేహితుడికి డికె.అరుణ కూడా ఆహ్వానం!

మంత్రి కేటీఆర్‌కు ఆంద్రా దుస్థితి గురించి చెప్పిన స్నేహితుడు ఎవరో తెలియదు కానీ ఆ అపరిచితుడు రాత్రికి రాత్రే చాలా పాపులార్ అయిపోయాడు. ఆయనను తీసుకొని వస్తే తాను స్వయంగా ఏపీ అంతా తిప్పి చూపిస్తానని ఏపీ పర్యాటకమంత్రి ఆర్‌కె. రోజా మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించైనా సంగతి తెలిసిందే. 

టిఆర్ఎస్‌పై నిత్యం కత్తులు దూస్తున్న బిజెపి మహిళా నేత డికె.అరుణ కూడా ఆయన ఎవరో చెప్పాలని, వీలైతే గద్వాలకు పంపించాలని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆ అపరచితుడిని పంపిస్తే తాను ఆయనను వెంటబెట్టుకొని తెలంగాణలో గద్వాలతో సహా అన్ని జిల్లాలలో గుంతలు పడి ఉన్న రోడ్లను దగ్గరుండి చూపిస్తానని చెప్పారు. 

కేటీఆర్‌ స్నేహితుడు గజ్వేల్ ఫామ్‌హౌస్‌ చుట్టూ తిరుగుతుంటారు కనుక రాష్ట్రమంతటా అలాగే అద్భుతమైన రోడ్లు ఉన్నాయని భ్రమ పడి ఉంటారని, అందుకే ఏపీతో పోలిస్తే తెలంగాణలో రోడ్లు అద్భుతంగా కనబడి ఉంటాయని డికె.అరుణ ఎద్దేవా చేశారు.