8.jpg)
ఈరోజు మాదాపూర్ హైటెక్స్ లో క్రెదాయ్ అధ్వర్యంలో జరిగిన ప్రాపర్టీ షోలో పాల్గొన్న తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, “సంక్రాంతికి పొరుగు రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్)లో తన ఊరికి వెళ్ళి నాలుగు రోజులు ఉండి వచ్చిన నా మిత్రుడు ఫోన్ చేసి, “ఏపీలో కరెంట్ లేదు...నీళ్ళు లేవు.. రోడ్లన్నీ పాడైపోయాయి....మళ్ళీ హైదరాబాద్ తిరిగిరాగానే సొంత ఇంటికి వచ్చిన్నట్లు హాయిగా ఉందన్నారు. మన ప్రభుత్వం ఎంత గొప్పగా పనిచేస్తోందో తెలియాలంటే విమర్శిస్తున్నవారికి బస్సూ ఏర్పాటు చేసి నాలుగు రోజులు ఏపీలో తిరిగి రమ్మనమని చెప్పండి,” అని సలహా ఇచ్చాడని చెప్పారు.
దీనిపై ఏపీ విద్యాశాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ, “కేటీఆర్‌కు ఎవరో ఫోన్ చేసి చెప్పిన మాట చెపుతున్నారు. కానీ నేను హైదరాబాద్‌లో నా ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ కరెంట్ లేకపోవడంతో జనరేటర్ వేసుకొని గడపాల్సి వచ్చింది. అయినా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి కేటీఆర్, కావాలంటే తన తెలంగాణ రాష్ట్రం గొప్పదనం గురించి చెప్పుకోవాలి కానీ పొరుగు రాష్ట్రం గురించి ఈవిదంగా చులకనగా మాట్లాడటం సబబు కాదు. ఆయన ఏపీ గురించి చేసిన ఆ వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకోవాలి,” అన్నారు.