సిఎం కేసీఆర్‌ నేడు నల్లగొండ పర్యటన

సిఎం కేసీఆర్‌ నేడు నల్లగొండలో పర్యటించనున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి చిరుమర్తి నర్సింహ ఇటీవల మరణించారు. ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించి ఈరోజు నార్కాట్‌పల్లిలో జరిగే సంతాపసభలో పాల్గొనేందుకు సిఎం కేసీఆర్‌ నల్లగొండకు బయలుదేరబోతున్నారు. 

సిఎం కేసీఆర్‌ ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి నేరుగా నార్కాట్‌పల్లి చేరుకొంటారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాప సభలో పాల్గొన్న తరువాత వారితో కలిసి భోజనం చేస్తారు. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ తిరుగుప్రయాణం అవుతారు. 

సిఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టిఆర్ఎస్‌ నేతలు ఈ సంతాప సభలో పాల్గొంటారు.