భారత్‌ ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే నియామకం

భారత్‌ ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే నియమించబోతున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ ఎంఎం నవరణే ఈ నెలాఖరుకి పదవీ విరమణ చేయనున్నారు. కనుక ప్రస్తుతం వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా ఉన్న మనోజ్ పాండేను ఆయన స్థానంలో నియమితులవుతున్నారు. మనోజ్ పాండే గత 39 ఏళ్ళుగా ఆర్మీలో వివిద హోదాలలో పనిచేశారు. ఈ నెల 30న ప్రస్తుత చీఫ్ నవరణే పదవీ విరమణ చేస్తారు. ఆదేరోజున మనోజ్ పాండే భారత్‌ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపడుతున్న తొలి ఇంజనీర్ ఈయనే కావడం విశేషం.