ఏపీ, తెలంగాణ బియ్యం శ్రీలంకకు

తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకొని అల్లాడిపోతున్న శ్రీలంకకు ఉదారంగా సాయం చేసేందుకు భారత్‌ ముందుకు వచ్చింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి కేంద్రప్రభుత్వం బియాన్ని కొనుగోలుచేసి శ్రీలంకకు అందిస్తోంది. మొత్తం మూడు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం శ్రీలంకకు సరఫరా చేయబోతోంది. దానిలో భాగంగా మంగళవారం 2,000 టన్నుల బియ్యంతో కార్గో షిప్పు కాకినాడ పోర్టు నుంచి శ్రీలంకకు రవాణా అయ్యింది. త్వరలో మళ్ళీ కాకినాడ, విశాఖ, చెన్నై, ట్యుటికోరిన్ పోర్టుల నుంచి శ్రీలంకకు బియ్యం రవాణా చేస్తారు. తాలిబన్ల పాలనలో విలవిలలాడుతున్న ఆఫ్గనిస్తాన్ దేశానికి కూడా భారత్‌ భారీగా బియ్యం అందిస్తూ ఆకలిచావుల నుంచి ఆఫ్గన్ ప్రజలను కాపాడుతోంది.