
ఆలేరు మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ నేత బూడిద భిక్షమయ్య గౌడ్ నేడు బిజెపిలో చేరబోతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ బిజెపి వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తదితరుల సమక్షంలో ఆయన తన అనుచరులతో కలిసి నేడు బిజెపిలో చేరానున్నారు. టిఆర్ఎస్లో ప్రాధాన్యం తగ్గడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న భిక్షపతి గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కానీ పార్టీ అధిష్టానం పట్టించుకోకపోవడంతో తన అనుచరులతో చర్చించి బిజెపిలో చేరాలని నిశ్చయించుకొన్నారు.
భిక్షమయ్య తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. 2009లో ఆలేరు నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2019లో కాంగ్రెస్కు రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు టిఆర్ఎస్కు గుడ్ బై చెప్పి బిజెపిలో చేరబోతున్నారు.