ఏపీ సంచలన వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ మళ్ళీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 8 ఏళ్ళు కావస్తున్నప్పటికీ ఇంతవరకు రాజధాని ఏర్పాటు చేసుకోలేదు కానీ కొత్తగా 26 జిల్లాలను ఏర్పాటు చేసుకొంటుండటం విశేషం. ఏప్రిల్ 4న ఉదయం 9.05 గంటల నుంచి 9.45  గంటలలోపుగా ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటుకాబోతున్నాయి. 

ఇక ఏపీ మంత్రి వర్గంలో కూడా మార్పులు జరుగబోతున్నాయి. ప్రస్తుత మంత్రివర్గం ఏప్రిల్ 7న చివరిసారిగా సమావేశం కానుంది. ఆ తరువాత ఏప్రిల్ 11న కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

ఏపీలో చాలా భారీగా విద్యుత్‌కి ఛార్జీలు పెరిగాయి. ఎప్పటిలాగే దీనిలో కూడా మద్యతరగతి ప్రజలపైనే ఎక్కువ భారం మోపబడింది. 0-30 యూనిట్ల వరకు 45 పైసలు; 31-75 యూనిట్ల వరకు 91 పైసలు; 76-125 యూనిట్ల వరకు రూ.1.40; 126-225 యూనిట్ల వరకు రూ.1.57; 226-400 యూనిట్ల వరకు రూ.1.16; 400 యూనిట్లు దాటితే యూనిట్‌కి 55 పైసలు చొప్పున ఈ ఏడాది ఆగస్ట్ నుంచి పెంచబోతున్నట్లు ఏపీ విద్యుత్‌కి నియంత్రణ మండలి నేడు ప్రకటించింది.