5.jpg)
తెలంగాణ ఏర్పడిన కొత్తలో టిఆర్ఎస్‌కు ఏకైక ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఉండేది. కనుక నిత్యం వాటి మద్య రాజకీయ యుద్ధాలు జరుగుతుండేవి. కానీ కాంగ్రెస్ బలహీనపడినప్పటి నుంచి టిఆర్ఎస్ ఆ పార్టీని పెద్దగా పట్టించుకోవడం మానేసింది. దాని స్థానంలోకి బిజెపి ప్రవేశించడంతో ఆ పార్టీతో టిఆర్ఎస్ పోరాడుతోంది. అయితే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ధాన్యం కొనుగోలుపై చేసిన ఓ తాజా ట్వీట్‌తో రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్, టిఆర్ఎస్‌ల మద్య కూడా యుద్ధం మొదలైంది.
ఇంతకీ రాహుల్ గాంధీ ఏమని ట్వీట్ చేశారంటే...
దీనిపై రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు వెంటనే స్పందిస్తూ...
తమ నాయకుడు రాహుల్ గాంధీపై మంత్రి హరీష్‌రావు ఈవిదంగా ట్వీట్ చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా ప్రతివిమర్శలు చేయడం ఖాయం. కనుక రాష్ట్రంలో కాంగ్రెస్, టిఆర్ఎస్‌ల మద్య మళ్ళీ రాజకీయ యుద్ధాలు ప్రారంభం కావచ్చు.