కేసీఆర్‌ దంపతులు కొల్హాపూర్ పర్యటన

దేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని శ్రీ అంబాబాయిగా కొలవబడే మహాలక్ష్మీ అమ్మవారి ఆలయం కూడా ఒకటి. సిఎం కేసీఆర్‌ దంపతులు, కుటుంబ సభ్యులు గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో కొల్హాపూర్ వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సిఎం కేసీఆర్‌ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేసీఆర్‌ దంపతులు ఈరోజు సాయంత్రం మళ్ళీ హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం అవుతారు.