సంబంధిత వార్తలు

భద్రాచలం పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి వినియోగించిన తలంబ్రాలను టీఎస్ఆర్టీసీ కార్గో అండ్ పార్సిల్ విభాగం భక్తుల ఇళ్ళ వద్దకు తెచ్చి అందజేస్తుందని ఆ సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఎండీ వీసి సజ్జనార్ తెలిపారు. స్వామివారి కళ్యాణోత్సవానికి వెళ్ళలేకపోయిన భక్తులు రాష్ట్రవ్యాప్తంగా గల టీఎస్ఆర్టీసీ కార్గో, పార్సిల్ కౌంటర్స్ వద్ద రూ.80 చెల్లించినట్లయితే తలంబ్రాలను భక్తుల ఇళ్ళ వద్దకే తెచ్చి అందజేస్తామని తెలిపారు. దీనికి సంబందించి వివరాల కొరకు 040-3010 2829 లేదా 6815 3333 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.