తెలంగాణ ప్రభుత్వానికి పీయూష్ జవాబు

ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని నిలదీస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ నేడు లోక్‌సభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. “ఓ రాష్ట్రంలో ఉత్పత్తి (దిగుబడి) ఆధారంగా ధాన్యం కొనుగోలు చేయడం సాధ్యం కాదు. ధాన్యం కొనుగోలులో అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. డిమాండ్, సప్లై, కనీస మద్దతు ధర, మార్కెట్లో పరిస్థితులు తదితర అనేక అంశాల ఆధారంగా ధాన్యం సేకరణ చేయవలసి ఉంటుంది. గోధుమలు సేకరణకు కూడా ఇవే అంశాలు వర్తిస్తాయి. రాష్ట్రాలలో పండే రా రైస్ కొనుగోలు చేసి జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం ఆ బియ్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా తిరిగి అవసరమున్న రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంటాము,” అని చెప్పారు. 

అయినప్పటికీ తెలంగాణలో పండిన ధాన్యం మొత్తం కేంద్రప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరేందుకు ఢిల్లీ వచ్చిన నలుగురు మంత్రులు తనను కలిసేందుకు పీయూష్‌ గోయల్‌  గురువారానికి అపాయింట్మెంట్ ఇచ్చారు.