జగ్గారెడ్డి పదవులు ఊడగొట్టిన రేవంత్‌ రెడ్డి

పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి పెద్ద షాక్ ఇచ్చారు. పార్టీకి, తన ప్రతిష్టకు భంగం కలిగించే విదంగా మాట్లాడినందుకు ఆయనను పార్టీ పదవులన్నిటి నుంచి తప్పించేసి ఆ బాధ్యతలను వేరే వారికి అప్పగించారు. జగ్గారెడ్డి కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్, ఐఎన్‌టియుసి, లేబర్ సెల్, అసంఘటిత కార్మికుల పరిరక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వాటన్నిటి నుంచి తక్షణం తప్పిస్తున్నట్లు రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. “పార్టీలో ఎంత సీనియర్స్ అయినా క్రమశిక్షణను పాటించాల్సిందే. ఎవరూ పార్టీ కంటే పెద్ద కాదు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు,” అని రేవంత్‌ రెడ్డి అన్నారు.