
యావత్ దేశంలో కలకలం సృష్టించిన కర్ణాటకలోని హిజాబ్ (ముస్లిం మహిళలు నెత్తిపై ధరించే వస్త్రం) వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం తుదితీర్పు ప్రకటించింది. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతూ రాజ్ అవస్థి నేతృత్వంలో, జస్టిస్ కృష్ణ ఎస్. దీక్షిత్, జస్టిస్ జె.ఎం.ఖాజీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తుదితీర్పులో ఏమి చెప్పింది అంటే... “ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం మాతాచారం కాదు. మత విశ్వాసం కూడా కాదు. కనుక ముస్లిం విద్యార్ధినులు అందరూ తాము చదువుకొంటున్న స్కూల్స్, కాలేజీల నిబందనల ప్రకారం యూనిఫారం ధరించి తరగతులకు హాజరవ్వాలి. దీనిపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరాదు. ఒకవేళ ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లయితే ఆయా స్కూల్స్, కాలేజీ యజమాన్యాలు వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు. ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా అవసరమైతే తగిన చర్యలు చేపట్టవచ్చు,” అని తీర్పులో పేర్కొంది.
సున్నైతమైన ఈ అంశంపై హైకోర్టు తీర్పు నేపధ్యంలో రాష్ట్రంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని పిటిషనర్లు నిర్ణయించుకొన్నారు.