
ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌లను బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభ నుంచి సస్పెండ్ చేయడంతో సింగిల్ జడ్జ్ హైకోర్టును ఆశ్రయించారు. కానీ స్పీకర్ విచక్షణాధికారాన్ని ప్రశ్నించలేమని కనుక ఈ వ్యవహారంలో కలుగజేసుకోలేమని తేల్చి చెప్పింది. దీంతో వారు మళ్ళీ హైకోర్టు ధర్మాసనంలో రిట్ పిటిషన్ వేశారు. ఈసారి హైకోర్టులో వారికి కాస్త ఉపశమనం కలిగింది కానీ వారిని బడ్జెట్ సమావేశాలలో పాల్గొనేందుకు అనుమతించాలని స్పీకర్‌ను ఆదేశించలేమని చెప్పడం నిరాశ కలిగించింది. సహేతుకమైన కారణం లేకుండా ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ సరికాదని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. శాసనసభకు వెళ్ళి స్పీకర్‌ను కలిసి సమావేశాలలో పాల్గొనేందుకు అనుమతించవలసిందిగా అభ్యర్ధించాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు సూచన మేరకు వారు ముగ్గురూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిశారు కానీ ఆయన సభ నిర్ణయానికి కట్టుబడి ఉండక తప్పదని కనుక వారిని సభలోకి అనుమతించలేనని స్పష్టం చేయడంతో ముగ్గురూ నిరాశతో వెనుతిరిగారు.
దుబ్బాకలో టిఆర్ఎస్ అభ్యర్ధిని ఓడించిన తరువాత బిజెపి ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ తొలిసారిగా కీలకమైన శాసనసభ బడ్జెట్ సమావేశాలకు హాజరైనప్పుడు, టిఆర్ఎస్‌కు ఏ చిన్న అవకాశం ఇచ్చినా ఈవిదంగా సస్పెండ్ చేస్తుందని తెలియానంత రాజకీయ అజ్ఞాని, అమాయకులు కారు. కనుక సభలో చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఉండాలి. కానీ తొలిరోజే సస్పెన్షన్ వేటు వేయించుకొని బయటకు వచ్చి, ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకు?సమావేశాలకు హాజరుకానివ్వకుండా టిఆర్ఎస్ కు ట్ర చేసిందని ఆరోపించడం దేనికి? దీని ఆంతర్యం ఏమిటి?