
బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌లకు హైకోర్టు ఎదురుదెబ్బ తగిలింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తమను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ వారు ముగ్గురూ వేర్వేరుగా వేసిన పిటిషన్లపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు, ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత ఈ విషయంలో తాము కలుగజేసుకోలేమని కనుక సస్పెన్షన్‌పై స్టే విధించలేమని తెలిపింది. మరో నాలుగు రోజులలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి. కనుక బిజెపి ఎమ్మెల్యేలు ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్ళినా తీర్పు వచ్చేలోగానే సమావేశాలు ముగిసిపోవచ్చు. కనుక కీలకమైన బడ్జెట్ సమావేశాలకు దూరంగా ఉండక తప్పదు.