.jpg)
ప్రస్తుతం రాష్ట్రంలో టిఆర్ఎస్, బిజెపిల మద్య రాజకీయ ఆధిపత్య పోరు కొనసాగుతోంది. దానిలో భాగంగా ఇరు పార్టీల నేతలు మీడియా, సోషల్ మీడియా వేదికలుగా తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకొంటున్నారు. బిజెపి మహిళా నేత విజయశాంతి ట్విట్టర్‌లో సిఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
“తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లక్ష ఉద్యోగాలు వస్తాయని ఊరించి, టిఆర్ఎస్‌ను గెలిపిస్తే ఆ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని, ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్, ఏడేళ్ళయినా ఇంతవరకు వాటికి నోటిఫికేషన్ విడుదల చేయలేదు కనీసం నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. రాష్ట్రంలో ఉపఎన్నికలు వచ్చినప్పుడల్లా త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని మభ్యపెడుతూ కాలక్షేపం చేస్తున్నారు తప్ప నోటిఫికేషన్ జారీ చేయడం లేదు,” అంటూ విజయశాంతి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆమె ఏమన్నారో ఆమె మాటలలోనే...