.jpg)
తెలంగాణ ప్రభుత్వానికి ఇవాళ్ళ వేల కోట్లు విలువచేసే భూములు దక్కాయి. హైదరాబాద్ మణికొండలో గల 1,654 ఎకరాల భూమి మొత్తం తెలంగాణ ప్రభుత్వానికే చెందుతాయని సుప్రీంకోర్టు ఈరోజు తుది తీర్పు చెప్పింది. వాటిపై దశాబ్ధాలుగా ప్రభుత్వానికి, వక్ఫ్ బోర్డుకి మద్య న్యాయ వివాదం నడుస్తోంది. హజరత్ హుస్సేన్ షా వలి దర్గాకు చెందిన ఆ భూములు తమవేనాని వక్ఫ్ బోర్డు వాదిస్తూ సమైక్య రాష్ట్రంలో ఏపీ హైకోర్టుని ఆశ్రయించగా, వక్ఫ్ బోర్డుకి అనుకూలంగా తీర్పు వచ్చింది. తెలంగాణ ఏర్పడిన తరువాత ఆ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2016లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అప్పటి నుంచి ఈ కేసుపై విచారణలు, వాదోపవాదాలు సాగుతూనే ఉన్నాయి. ఇవాళ్ళ సుప్రీంకోర్టు ఆ కేసులో తుది తీర్పు వెలువరిస్తూ 1,654 ఎకరాలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతాయని తేల్చి చెప్పింది. దీంతో వేల కోట్లు విలువగల భూమి రాష్ట్ర ప్రభుత్వం చేతికి వచ్చింది.