
కేంద్రహోంమంత్రి అమిత్ షా మంగళవారం హైదరాబాద్‌కు రానున్నారు. రేపు సాయంత్రం 4.40 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శంషాబాద్ పరిధిలోని ముచ్చింతల్ చేరుకొని సమతా స్పూర్తి కేంద్రంలో శ్రీ రామానుజాచార్య విగ్రహాన్ని, 108 దివ్యదేశాలను సందర్శిస్తారు. ఆలయంలో పూజా కార్యక్రమాలలో పాల్గొన్న తరువాత మళ్ళీ రాత్రి 8 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.
ప్రధాని నరేంద్రమోడీ మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు సిఎం కేసీఆర్ ఆయనను కలవకపోవడంతో బిజెపి నేతలు విరుచుకుపడగా, టిఆర్ఎస్ మంత్రులు కేంద్రాన్ని, ప్రధాని మోడీని విమర్శించారు. దీంతో టిఆర్ఎస్, బిజెపిల మద్య యుద్ధం కొనసాగుతోంది. రేపు కేంద్రహోంమంత్రి అమిత్ షా వస్తున్నందున మళ్ళీ ఇవే ఘటనలు పునరావృతం కాకమానవు.
ఇప్పుడు రాష్ట్ర మంత్రులు ఢిల్లీ వెళ్ళినా, కేంద్రమంత్రులు హైదరాబాద్ వచ్చినా ఈవిదంగా యుద్ధ వాతావరణం ఏర్పడుతుండటం విశేషం. టిఆర్ఎస్, బిజెపిల మద్య రాష్ట్రంలో మొదలైన రాజకీయ ఆధిపత్యపోరులో చివరికి ఏ పార్టీ పైచేయి సాధిస్తుందో వచ్చే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలనాటికి స్పష్టం కావచ్చు.