
గాన కోకిల లతా మంగేష్కర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంచనాలతో నిన్న సాయంత్రం ముంబై శివాజీ పార్కులో జరిగాయి. ఆమె అంత్యక్రియలకు ప్రధాని నరేంద్రమోడీ, పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యి నివాళులు అర్పించారు. నేడు పార్లమెంటు ఉభయసభల సభ్యులు ఆమెకు నివాళులు ఆర్పిస్తారు. అనంతరం సంతాప సూచకంగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను గంటసేపు వాయిదా వేస్తారు.
లతా మంగేష్కర్‌కు మృతికి సంతాపంగా కేంద్రప్రభుత్వం నిన్న, ఈరోజు రెండు రోజులు దేశవ్యాప్తంగా శాంతపడినాలుగా ప్రకటించింది. సంతాప సూచకంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సెలవు ప్రకటించింది. ముంబైలో ఈరోజు జరుగవలసిన ద్రవ్య విధాన కమిటీ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.