
సిఎం కేసీఆర్ సోమవారం యాదాద్రిలో పర్యటించనున్నారు. ఇవాళ్ళ ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గం ద్వారా యాదాద్రికి చేరుకొంటారు. తుది దశకు చేరుకొన్న ఆలయ నిర్మాణ పనులు, ఆలయ గోపురం, ప్రధాన ద్వారమ, ధ్వజ స్తంభం, బలిపీఠాల బంగారు తాపడం పనులను పరిశీలిస్తారు. వచ్చే నెల 28వ తేదీన జరుగబోయే మహాకుంభ సంప్రోక్షణ చేసి ఆలయాన్ని పునః ప్రారంభించబోతున్నందున, దానికి వారం రోజుల ముందుగా కొండపై 6,000 మంది రుత్విక్కులు 1,108 కుండాలతో సుదర్శనయాగం చేయాలని సిఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. సుదర్శన యాగానికి ఏర్పాట్లు గురించి నేటి పర్యటనలో ఆలయ అధికారులతో సిఎం కేసీఆర్ చర్చించనున్నారు.
ఈ యాగానికి రాష్ట్రపతి, ప్రధాని నరేంద్రమోడీ, వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీఠాధిపతులు, దేశ విదేశాల నుంచి భక్తులను ఆహ్వానించబోతున్నారు.