
చర్లపల్లి రైల్వేస్టేషన్ విస్తరణ పనులకు కేంద్రప్రభుత్వం బడ్జెట్‌లో రూ.70 కోట్లు కేటాయించింది. దీంతో తొలిదశ పనులు చేపట్టి రెండేళ్ళలో పూర్తి చేస్తామని దక్షిణ మధ్యరైల్వే జనరల్ మేనేజర్ సంజీవి కిషోర్ తెలిపారు. తొలిదశలో స్టేషన్ ప్రాంగణం విస్తరణ, సిసి రోడ్ల నిర్మాణం, విద్యుత్ సబ్ స్టేషన్, స్టేషన్ మెయింటెనెన్స్ షెడ్ నిర్మిస్తారు. ఇప్పుడున్న ప్లాట్‌ఫారంల ఎత్తు, పొడవు పెంచి త్రాగునీటి సౌకర్యం కల్పిస్తారు. త్రాగునీటి కోసం ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మిస్తారు. అలాగే రెండు సబ్ వేలు, రెండు హైలెవెల్ ఐల్యాండ్‌లు, మూడు ర్యాంపులు, ఐదు చోట్ల బ్రిడ్జి పనులు, ఆరు చోట్ల మెట్ల మార్గాలు నిర్మిస్తారు. మరికొన్ని చిన్న చిన్న సివిల్ పనులు కూడా పూర్తి చేస్తారు.
చర్లపల్లి రైల్వేస్టేషన్ విస్తరణ పనులు పూర్తయితే సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్‌లకు వచ్చే కొన్ని రైళ్లను అక్కడికి మళ్ళిస్తారు లేదా దూర ప్రాంతాల నుంచి అక్కడి నుంఢి కొన్ని రైళ్ళు రాకపోకలు సాగేందుకు అవకాశం కలుగుతుంది.