
కేంద్రప్రభుత్వం దానిని నడిపిస్తున్న బిజెపితో సిఎం కేసీఆర్, మంత్రులు, ప్రజా ప్రతినిధులు తమ యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇవాళ్ళ టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ట్విట్టర్ ద్వారా ఓ బాణం సందించారు. ఇటీవల సిఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి అడిగిన ప్రశ్నలకు ప్రధాని నరేంద్రమోడీ సూటిగా సుత్తిలేకుండా సమాధానం చెప్పాలని ఆమెను కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారో చెప్పాలని నిలదీశారు. దేశం కోసమే అయితే దేశమంటే మట్టి మాత్రమే కాదని గుర్తు చేశారు. ఎల్ఐసీని అమ్మేస్తే ఉద్యోగాలు, రిజర్వేషన్లు కోల్పోయే బిడ్డల కుటుంబాల పరిస్థితి ఏమిటని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.