సంబంధిత వార్తలు

సిఎం కేసీఆర్ నిన్న ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “ఇప్పుడే చెపుతున్నాను. వచ్చే శాసనసభ ఎన్నికలలో మాపార్టీ 95-105 సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి రాబోతోంది. కావాలంటే మీరు రాసిపెట్టుకోండి,” అని అన్నారు.
‘ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళతారా?’ అనే ఓ విలేఖరి ప్రశ్నకు సమాధానమిస్తూ, “ప్రతీసారి ఒకే మంత్రం పనిచేయదు. ఈసారి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళతాము. ఈసారి ఎన్నికలలో మరో గొప్ప మంత్రం ప్రయోగించబోతున్నాము. దాంతో కాంగ్రెస్, బిజెపిలు కనబడకుండాపోతాయి,” అని చెప్పారు.