సంబంధిత వార్తలు

పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన తెలంగాణ డోలు వాయిద్య కళాకారుడు సకిని రామచంద్రయ్యను సిఎం కేసీఆర్ నిన్న ప్రగతి భవన్‌లో ఘనంగా సన్మానించారు. అంతరించిపోతున్న ఈ కళను కాపాడటమే గాక ఈ అవార్డుతో దానికి జాతీయస్థాయిలో గుర్తింపు కూడా తెచ్చారని అభినందించారు. ఆయన స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఓ ఇంటి స్థలం, ఇల్లు కట్టుకోవడానికి కోటి రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ ఇంటి నిర్మాణానికి సహకరించవలసిందిగా సిఎం కేసీఆర్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును ఆదేశించారు.