కేంద్రంపై నిప్పులు చెరిగిన సిఎం కేసీఆర్‌

సిఎం కేసీఆర్‌ మంగళవారం సాయంత్రం ప్రెస్‌మీట్‌ పెట్టి సుమారు రెండున్నర గంటల పాటు కేంద్రప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్ర బడ్జెట్‌లో అనేక లోపాలను ఎత్తి చూపుతూ కేంద్రం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. సిఎం కేసీఆర్‌ ఏమన్నారో క్లుప్తంగా... 

• కేంద్ర బడ్జెట్‌ ఓ గోల్‌మాల్‌ గోవిందం బడ్జెట్‌. దానికి దశ, దిశ ఏమీ లేదు. నిర్మలా సీతారామన్ దేశ ప్రజలను అంకెల గారడీతో దేశప్రజలను వంచించారు. 

• దేశంలో ఎస్సీ, ఎస్టీ జనాభా 40 శాతానికి పెరిగింది. కానీ వారి సంక్షేమానికి రూ.12,800 కోట్లు మాత్రమే కేటాయించింది. అదే...తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలోనే రూ.33,600 కోట్లు కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం కేటాయించినంత కూడా కేంద్రప్రభుత్వం కేటాయించలేకపోయింది. 

• కరోనా కారణంగా దేశంలో వైద్యఆరోగ్య రంగాలను బలోపేతం చేసుకోవలసి ఉండగా వాటికి బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారు. 

• అలాగే వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసుకోవలసి ఉండగా దానినీ పట్టించుకోలేదు. పైగా కేంద్రప్రభుత్వం ఎరువుల ధరలు పెంచి రైతులను నిండా ముంచేస్తోంది. 

• రాష్ట్రాల అనుమతి, ప్రమేయం లేకుండా నదుల అనుసంధానం చేస్తామని బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పడం పెద్ద తప్పు. 

• ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్‌ ప్రసంగంలో ఎల్ఐసీని అమ్మేస్తున్నామని సిగ్గు లేకుండా చెప్పారు.

• క్రిప్టో కరెన్సీపై 30 శాతం పన్ను ఏవిదంగా విధిస్తారు?

ఇంకా పలు అంశాలపై సిఎం కేసీఆర్‌ కేంద్రప్రభుత్వాన్ని చాలా తీవ్రంగా విమర్శించారు.