దశ, దిశ, పసలేని బడ్జెట్‌ ఇది: సిఎం కేసీఆర్‌

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ ఈరోజు లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సిఎం కేసీఆర్‌ చాలా తీవ్రంగా స్పందించారు. ఇదొక దశ, దిశ, పసలేని బడ్జెట్‌. బడ్జెట్‌ అంతా మాటలు, అంకెల గారడీతో నిండిపోయింది. దీని వలన దేశంలో ఏ వర్గానికి ప్రయోజనం కలుగదు. వైద్యం, చేనేత, వ్యవసాయానికి బడ్జెట్‌లో సరైన కేటాయింపులే లేవు. ఆదాయపు పన్ను స్లాబులు మార్చకపోవడం వలన ఉద్యోగులు తీవ్ర నిరాశ చెందారు. మౌలికావసతుల కల్పనకు తగినన్ని కేటాయించలేదు. తమ జబ్బలు తామే చరుచుకొంటూ మాటలు, అంకెల గారడితో  దేశ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు తప్ప దీని వలన ఉపయోగం ఉండదు,” అని సిఎం కేసీఆర్‌ అన్నారు.