కేంద్ర బడ్జెట్‌లో ముఖ్యాంశాలు

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఉదయం లోక్‌సభలో 2022-23 సంవత్సరాలకి గాను ఆర్ధిక బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. దానిలో ముఖ్యాంశాలు: 

బడ్జెట్‌ అంచనా విలువ: రూ.39.45 లక్షల కోట్లు.  

వివిద ఆదాయ వనరుల ద్వారా రాబడి అంచనా: 22.84 లక్షల కోట్లు. 

బడ్జెట్‌ లోటు: రూ.17 లక్షల కోట్లు. 

ద్రవ్యలోటు: 6.9 శాతం.  

ఆదాయపు పన్ను: పన్ను శ్లాబులలో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇదివరకులాగే ఏడాదికి రూ.2.50 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి  ఆదాయపు పన్ను ఉండదు. అంతకు మించి వార్షికాదాయం ఉన్నవారికి, 60 ఏళ్ళు అంతకు మించి వయసున్న వారికి గతంలోలాగే ఆదాయపు పన్ను చెల్లించవలసి ఉంటుంది. రెండేళ్లడాకా ఆదాయపన్ను రిటర్న్స్ ఫైలింగ్ చేసుకోవచ్చు.     

కొత్త రైళ్ళు: ప్రధాని గతిశక్తి పధకం కింద వచ్చే మూడేళ్ళలో దేశవ్యాప్తంగా 400 వందే భారత్‌ రైళ్ళు ప్రవేశపెడతామని ప్రకటించారు. కొత్తగా కార్గో టెర్మినల్స్ నిర్మాణం. వచ్చే ఏడాదిలోగా దేశంలో కొత్తగా 2,000 కిమీ రైల్వే లైన్ల నిర్మాణం. పర్యాటక ప్రాంతాలను పిపిపి పద్దతిలో అభివృద్ధి. దేశంలోని 8 పర్యాటక ప్రాంతాలలో 60కిమీ పొడవునా రోప్ వేల నిర్మాణం. 

 ఇళ్ళ నిర్మాణం: ప్రధాని ఆవాస్ యోజన పధకం కింద దేశవ్యాప్తంగా 80 లక్షల ఇళ్ళు నిర్మాణం. వీటి కోసం రూ.48,000 కోట్లు కేటాయింపు. 

దేశవ్యాప్తంగా 25,000 కిమీ మేర కొత్తగా జాతీయ రహదారుల నిర్మాణం. 

మేకిన్ ఇండియాలో భాగంగా 60 లక్షల ఉద్యోగాల కల్పన. పిపిపి పద్దతిలో ఆహార శుద్ధి ప్లాంట్స్ ఏర్పాటు. వ్యవసాయోత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేకంగా పోర్టల్ ఏర్పాటు. 

2022 చివరినాటికి దేశవ్యాప్తంగా 5జి సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి. 2025నాటికి దేశవ్యాప్తంగా ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ఏర్పాటు. త్వరలో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టనున్న ఆర్‌బీఐ.    

కరోనా కారణంగా విద్యార్దులు పాఠశాలలు, కాలేజీలకు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడుతున్నందున ప్రతీ తరగతికి ఒక్కో ఛానల్ చొప్పున 200 టీవీ ఛానల్స్ ఏర్పాటు. రూ.250 కోట్లు వ్యయంతో కొత్తగా 5 విద్యాసంస్థల ఏర్పాటు. దేశవ్యాప్తంగా రెండు లక్షల అంగన్వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్.