రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం జూలైలో పూర్తి

నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశ్యించి ప్రసంగించనున్నారు. ఈ ఏడాది జూలైతో ఆయన పదవీ కాలం పూర్తవుతుంది. కనుక రాష్ట్రపతి హోదాలో పార్లమెంటులో నేడు చేయబోయే ప్రసంగమే చివరిది. ఆయన 2017, జూలై 25వ తేదీన రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు బిహార్ గవర్నర్‌గా వ్యవహరించారు. రాజకీయాలలో ప్రవేశించక మునుపు సుమారు 16 ఏళ్ళపాటు న్యాయవాదిగా పనిచేశారు. 

రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం జూలైలో ముగుస్తుంది కనుక ప్రధాని నరేంద్రమోడీ ఆయన స్థానంలో ఎవరిని రాష్ట్రపతిగా అవకాశం కల్పిస్తారో మే-జూన్‌ నాటికి స్పష్టత రావచ్చు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న ఎం.వెంకయ్యనాయుడికి అవకాశం కల్పిస్తే అది రెండు తెలుగు రాష్ట్రాలకు చాలా సంతోషకరమైన విషయమే అవుతుంది.