
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు నేడు ఆన్‌లైన్‌లో విచారణ చేపట్టగా ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది దీనిపై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఈ విచారణకు హాజరైన ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావు, కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను, కరోనా తాజా పరిస్థితిని న్యాయమూర్తికి వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3.16 శాతం పాజిటివిటీ రేటు ఉందని, రాష్ట్రవ్యాప్తంగా 77 లక్షల ఇళ్ళలో జ్వర సర్వే నిర్వహించి 3.45 లక్షల మందికి కరోనా చికిత్స కిట్స్ అందజేశామని తెలిపారు. ‘పిల్లలకు కూడా కిట్స్ ద్వారా మందులు అందిస్తున్నారా?’ అనే ప్రశ్నకు నిబందనల ప్రకారం ఆవిదంగా ఇవ్వరాదని తెలిపారు. వారాంతపు సంతల్లో, మేడారం జాతరలో కరోనా కట్టడికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టిందో నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేసింది.