రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఈసారి హైదరాబాద్‌లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఈరోజు ఉదయం 7 గంటలకు రాజ్‌భవన్‌లో జాతీయ జెండా ఎగురవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో దేశం, సిఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. కరోనా కట్టడి, వాక్సినేషన్‌లో భారత్‌ చాలా చురుకుగా వ్యవహరిస్తోందని అన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ అధ్యక్షతన రూపొందిన భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ రాజ్యాంగమని అన్నారు. 


రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రభుత్వం తరపున సిఎస్ సోమేష్ కుమార్‌, డిజిపి మహేందర్ రెడ్డి పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.