తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు శుభవార్త!

తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు శుభవార్త! ఉద్యోగులందరూ ఫిబ్రవరిలో ఒకేసారి మూడు డీఏలు అందుకోబోతున్నారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గడంతో 2020-2021 సంవత్సరాలకు సంబందించి డీఏలను ప్రభుత్వం ఇంతవరకు చెల్లించలేకపోయింది. కనుక వాటి కోసం ఉద్యోగులు చాలారోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో డీఏ బకాయిలను చెల్లించాలని నిర్ణయించడంతో ఉద్యోగులు వచ్చే నెల జీతంతో పాటు మూడు డీఏలు ఒకేసారి అందుకోబోతున్నారు. 

2020లో జనవరి, జూలై, 2021 జనవరి మూడు నెలలది కలిపి మొత్తం 10.01 శాతం వచ్చే నెల జీతంతో పాటు చెల్లించబోతోంది. 

2021 జూలై నుంచి డిసెంబర్‌ వరకు చెల్లించాల్సిన డీఏ బకాయిలను మాత్రం ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలలో జమా చేస్తుంది. 

ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా మూడు డీఏ బకాయిలను చెల్లించబోతోంది. కానీ వారికి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆరు విడతల్లో డీఏ బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుంది.