ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం

నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత, కె.దామోదర్ రెడ్డి ఇవాళ్ళ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రోటెం ఛైర్మన్ జాఫ్రీ మండలి ఛైర్మన్ ఛాంబర్‌లో వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

స్థానిక సంస్థల కోటాలో టిఆర్ఎస్‌కు చెందిన మొత్తం 12 మంది ఎమ్మెల్సీలుగా ఎన్నికవగా వారిలో కవిత, దామోదర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలినవారు కూడా త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.