సంబంధిత వార్తలు

తెలంగాణ ఎన్నికల కమీషనర్ శశాంక్ గోయల్ కేంద్ర సర్వీసుకి బదిలీ అయ్యారు. ఆయనను కేంద్ర కార్మిక శాఖ అదనపు కార్యదర్శిగా నియమిస్తూ కేంద్రప్రభుత్వం (కేంద్ర సిబ్బంది, వ్యవహారాలు, శిక్షణ శాఖ) మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
శశాంక్ గోయల్ 2021 మేలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్‌గా పనిచేశారు. శశాంక్ గోయల్ స్థానంలో ఎవరు నియమితులవుతారో ఈరోజు సాయంత్రంలోగా తెలిసే అవకాశం ఉంది.