
సిఎం కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రగతి భవన్లో మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. దానిలో తీసుకొన్న కొన్ని కీలక నిర్ణయాలు:
• రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం.
• రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణకు చట్టం చేయాలనే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం. దీనిపై లోతుగా అధ్యయనం చేసి సిఫార్సు చేయడానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో మంత్రుల సబ్-కమిటీ ఏర్పాటు. ఈ సబ్-కమిటీలో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ సభ్యులుగా ఉంటారు.
• ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకుగాను ‘మన ఊరు-మన బడి’ పేరిట కార్యక్రమం కొరకు రూ.7,289 కోట్లు కేటాయింపు. దీంతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను కల్పిస్తారు.
• ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా నియంత్రణలోనే ఉన్నందున, వాక్సినేషన్, ఆసుపత్రులలో వైద్య సౌకర్యాల పెంపుకు తగిన చర్యలు తీసుకోవాలని క్యాబినెట్ నిర్ణయించింది. కనుక ప్రస్తుతం రాత్రి కర్ఫ్యూ, పాక్షిక లాక్డౌన్ వంటివేవీలేనట్లే.
• అకాల వర్షాల కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంటలు దెబ్బ తిన్నాయి. కనుక సిఎం కేసీఆర్ రేపు (మంగళవారం) జిల్లాలో పర్యటించి పరిస్థితులను సమీక్షించాలని క్యాబినెట్ నిర్ణయించింది.