రేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం

సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం జరుగనుంది. రాష్ట్రంలో మళ్ళీ కరోనా కేసులు గణనీయంగా పెరిగినందున కరోనాకు అడ్డుకట్ట వేయడానికి తీసుకోవలసిన చర్యలు, ఆసుపత్రుల పరిస్థితి, పాక్షిక లాక్‌డౌన్‌ లేదా నైట్ కర్ఫ్యూ విధించడం, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ధాన్యం కొనుగోలు, ఎరువుల ధరల పెంపు తదితర సమస్యలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి కావస్తోంది కనుక ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయడం గురించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.