
తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా రైతు బంధు వేడుకలు జరుగుతున్నాయి. రైతు బంధు పధకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.50,000 కోట్లు రైతుల ఖాతాలలో జమ చేసిన సందర్భంగాఈ వేడుకలు నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ వేడుకలలో ఆయా జిల్లాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టిఆర్ఎస్ నేతలు పాల్గొంటున్నారు. రాష్ట్రంలో సాగునీరు, రైతులకు ఉచిత విద్యుత్, రైతుబంధు వగైరాలు ఇస్తూ తమ ప్రభుత్వం ఏవిదంగా వ్యయవసాయాభివృద్ధికి తోడ్పడుతోందో టిఆర్ఎస్ నేతలు ప్రజలకు వివరిస్తున్నారు. జిల్లాలలో మంత్రులు, ఎమ్మెల్యేల నేతృత్వంలో జరుగుతున్నా ఈ వేడుకల్లో సిఎం కేసీఆర్ కటౌట్లు, బ్యానర్లు పెట్టి ఆయన నేతృత్వంలో రాష్ట్రం ఏవిదంగా అభివృద్ధి సాధిస్తోందో వివరిస్తున్నారు. సంక్రాంతి పండుగ వరకు రైతుబంధు వేడుకలు జరుగనున్నాయి.