
తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కరోనా కేసులు శరవేగంగా పెరుగుతుండటం, ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండటంతో కరోనా ఆంక్షలను ఈ నెల 10 నుంచి 20వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సిఎం కేసీఆర్ నిన్న ప్రగతి భవన్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా, ఒమిక్రాన్‌లను ఎదుర్కొనేందుకు చేసిన ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. ప్రజలందరూ మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలని, సంక్రాంతి పండుగను ఎవరి ఇళ్ళలో వారు జరుపుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం కరోనా ఆంక్షలను 20వరకు పొడిగించినందున అప్పటి వరకు రాష్ట్రంలో రాజకీయ సభలు, సమావేశాలు, ర్యాలీలు, దీక్షలు, సామూహిక ఉత్సవాలు, వేడుకలు నిర్వహించరాదని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.