ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్

కేంద్ర ఎన్నికల కమీషన్‌ శనివారం ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. యూపీలో ఏడు దశలలో, మణిపూర్‌లో రెండు దశలలో, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఒక దశలో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. ఐదు రాష్ట్రాలలో మార్చి 10వ తేదీన ఓట్లు లెక్కించి ఆదే రోజున ఫలితాలు ప్రకటిస్తారు. 

యూపీ: 403 శాసనసభ స్థానాలకు ఫిబ్రవరి 10, 14, 20,23,27, మార్చి 3, 4 తేదీలలో పోలింగ్. 

పంజాబ్‌లోని 117, ఉత్తరాఖండ్ 70, గోవాలో 40 స్థానాలకు రాష్ట్రాలలో ఫిబ్రవరి 14న పోలింగ్. 

మణిపూర్‌లో 60 స్థానాలకు ఫిబ్రవరి 27, మార్చి 3వ తేదీన పోలింగ్ జరుగుతుంది.