సంబంధిత వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ పదవీకాలం మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన 2015 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఈ ఏడేళ్ళలో ప్రభుత్వం ఆయన పదవీకాలన్ని ఐదుసార్లు పొడిగించింది. ఇప్పుడు మరో ఏడాది పొడిగించడంతో 2022 డిసెంబర్ 31 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఆయన సారధ్యంలో సింగరేణి లాభాలు ఆర్జిస్తుండటం, కార్మిక సంఘాలతో సత్సంబంధాలు కలిగి ఉండటం, ప్రభుత్వానికి విధేయుడిగా ఉండటం వంటివి ఆయన పదవీకాలం పొడిగింపుకు కారణాలుగా కనిపిస్తున్నాయి.