టిఆర్ఎస్‌తో దోస్తీ లేదు ఇక కుస్తీయే: నడ్డా

బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిన్న హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ విలేఖరి “టిఆర్ఎస్‌, బిజెపిల మద్య గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది దానికి మీ సమాధానమేమిటి? అని ప్రశ్నించగా జేపీ నడ్డా స్పందిస్తూ, “కాంగ్రెస్ పార్టీ స్వయంగా టిఆర్ఎస్‌తో పోరాడలేదు మరొకరిని పోరాడనీయదు. టిఆర్ఎస్‌పై మా పోరాటం కొనసాగుతుంది. రాష్ట్రంలో టిఆర్ఎస్‌ను ఢీకొని నిలువగలిగేది బిజెపి మాత్రమే. గ్రేటర్ హైదరాబాద్‌, దుబ్బాక, హుజూరాబాద్‌ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం,” అని చెప్పారు.